బదిలీ కొరకు చేసిన విన్నపములు ఈక్రింది విధానముల ఆధారముతో పరిశీలించబడును:


A.అభ్యర్ధి కోరిన స్థలము/స్థలములలో మంజూరు చేయబడిన కార్మికుల సంఖ్యను అనుసరించి లభ్యమయే ఖాళీలను బట్టి బదిలీలు చేయబడును.
B.బదిలీని కోరుతున్న అభ్యర్ధులు వారు పని చేయుచున్న స్థలములో 2 సం. లకు తక్కువ కాకుండా సర్వీసును పూర్తి చేసి యుండవలెను.
C.ఖాళీల సంఖ్య కన్నా విన్నపముల సంఖ్య ఎక్కువగా ఉన్నచో ఈ సందర్భములో జారీ చేయబడిన సర్కులర్ నం.P(PM) 4/3208/1757 Dt.28-08-1997 ఆధారముగా అభ్యర్ధుల సీనియారిటీని లెక్కించబదును.
D.కంపెనీ యొక్క స్థాయీ ఉత్తరవులకు లోబడి క్రమశిక్షణాత్మక చర్యలు ఎదురుకుంటున్న అభ్యర్ధుల యొక్క విన్నపములు వారి ఫై మోపబడిన అభియోగాలకు సంబంధించిన క్రమశిక్షణ చర్యలు పూర్తి అయిన తరువాత మాత్రమే పరిశీలించబడును.
E.విజిలేన్సు కారణముల ఫై బదిలీ అయిన ఉద్యోగుల విన్నపములు పరిశీలించబడువు.
F.ఉద్యోగి యొక్క విన్నపము ఒకసారి నమోదు కాబడినచో అతడు/ఆమె దానిని వెనుకకు తీసుకొనుటకు వీలు లేదు. కాబట్టి, నిజముగా బదిలీ అవసరం అనుకున్న అభ్యర్ధులు మాత్రమే నమోదు చేసుకొనవలెను.
G.ఈ నూతన ఆన్-లైన్ విధానం ద్వారా అభ్యర్ధులు తమ విన్నపములను నమోదు చేసుకొనిన తరువాత అతడు/ఆమె విన్నపముయొక్క సీరియల్ నం. ఒకటి సిస్టం నుండి అభ్యర్ధి యొక్క మొబైల్ కు సంక్షిప్త సందేశం(SMS ) ద్వారా పంపబడుతుంది. అభ్యర్ధులు వారి యొక్క సీరియల్ నం. ను భవిష్యతు ప్రయోజనము కొరకు వ్రాసి పెట్టుకొనవలెను.


"ప్రాచీన హోదాని పొందలేని తెలుగుని, భావి హోదానన్నా పోగొట్టుకోకుండా చూసుకుందాము" - తెలుగు వ్రాయండి, వ్రాయించండి..