NewInstruction : Employees allotted accommodation for two days have to pay two days room tariff amount to Pushpagiri Mutt Authorities even though they want to vacate after 1st day. So kindly book rooms accordingly.
Responsive image Responsive image

    *** ముఖ్య సూచనలు ***

  • ఉద్యోగి తన ఎంప్లాయి కోడ్ మరియు కంపెనీలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు ద్వారా లాగిన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబరు కంపెనీలో (ఎస్ ఏ పీ) లో లేకపోయినా లేదా మొబైల్ నెంబరు మారినట్లయినా తక్షణమే గని / విభాగం లోని సంబంధిత అధికారి కి చెప్పి మొబైల్ నెంబరును అప్ డేట్ చేసుకున్న అనంతరమే లాగిన్ అవడానికి అవకాశం ఉంటుంది.
  • తిరుమలకు వెళ్లడానికి సరిగ్గా 30 రోజుల ముందు ఆన్లైన్ లో వసతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణానికి 10 రోజుల ముందు వరకు ఖాళీలను బట్టి దరఖాస్తుల స్వీకరించడానికి వెబ్ పోర్టల్ లో అవకాశం ఉంటుంది.
  • తీర్థ యాత్రకు సరిగ్గా వారం రోజుల ముందు రూం కన్ఫర్మేషన్ కు సంబంధించిన మెసెజ్ రిజిస్టర్డు మొబైల్కు పంపడం జరుగుతుంది.
  • మొదటగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన వారికి మొదటి ప్రాధాన్యంగా రూంల కేటాయింపు ఉంటుంది.
  • ఒక్కరిగా యాత్రకు వెళ్లే వారికి వసతి సౌకర్యం ఉండదు. కనిష్టం గా ఇద్దరు ఉండొచ్చు.
  • ఒక రూంలో గరిష్ఠంగా నలుగురు (పిల్లలతో కలిపి) ఉండొచ్చు.
  • ఉద్యోగి గరిష్టంగా రెండు గదుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కనిష్టంగా ఒక రోజు, గరిష్టంగా రెండు రోజుల వరకు మాత్రమే బస చేయడానికి అవకాశం ఉంటుంది.
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్పగిరి మఠంలో రిపోర్టు చేయడానికి అవకాశం ఉంటుంది. చెక్ అవుట్ మాత్రం మరుసటి రోజు లేదా రెండో రోజు ఉదయం 9 గంటల వరకే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి పుష్పగిరి ట్రస్టు యాజమాన్యానికి సహకరించాలి.
  • వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఒక గని / విభాగం నుంచి రోజులో గరిష్టంగా రెండు దరఖాస్తులను మాత్రమే స్వీకరించడం జరుగుతుంది.
  • ఒకసారి ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారు ఆరు నెలల(180 రోజుల) అనంతరం మళ్లీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఆన్లైన్ దరఖాస్తును 10 రోజుల ముందే క్యాన్సిల్ చేసుకున్న వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.
  • ఎవరైనా ప్రయాణాలు రద్దు చేసుకుంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం వస్తుంది.
  • తిరుమలలో రద్దీ పెరగడం, ఇతరత్రా ఏదైనా కారణాల వల్ల గదులు లభించని పరిస్థితులు తలెత్తినప్పుడు ఆన్లైన్ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంటుంది.
  • ఉద్యోగులు కంపెనీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పుష్పగిరి మఠం నిర్వాహకులకు ఉద్యోగి తన కార్డును చూపించి నిర్దేశిత రుసుంను చెల్లించాలి.
  • ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన ఉద్యోగి పేరుతో ఇతరులు వెళ్లకూడదు. అలా వెళ్తే పుష్పగిరి మఠంలో గదులను కేటాయించడం జరగదు. కంపెనీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి.
  • ప్రతీ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా 3 రోజులు, వైకుంఠ ఏకాదశి సందర్భం 3 రోజులు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజులు ఆన్ లైన్ వసతి సదుపాయం ఉండదు.
  • పైన పేర్కొన్న నియమ నిబంధనలను అతిక్రమిస్తే సదరు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
    • *** ఉద్యోగుల తిరుమల ప్రయాణం సౌకర్యవంతంగా సాగేందుకు వీలుగా చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరుతూ..-సింగరేణి యాజమాన్యం ***